యాదగిరిగుట్ట: కన్నుల పండుగగా యాదాద్రి స్వామి వారి కళ్యాణం

243చూసినవారు
యాదగిరిగుట్ట: కన్నుల పండుగగా యాదాద్రి స్వామి వారి కళ్యాణం
యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో ఇవాళ నిత్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉత్సవ మండపంలో సుదర్శన నరసింహ హోమం, వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ లక్ష్మీనరసింహుని కళ్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. విశ్వక్సేన ఆరాధన, రక్షాబంధనం, మాంగళ్య ధారణ, తలంబ్రాల కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ ఉత్సవంలో పాల్గొన్న భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్