శనివారం భువనగిరి పట్టణంలోని పలు హోటళ్లు, వ్యాపార కేంద్రాల్లో పౌరసరఫరాల అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న ఏడు డొమెస్టిక్ సిలిండర్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వ్యాపార కేంద్రాల్లో కేవలం కమర్షియల్ సిలిండర్లను మాత్రమే ఉపయోగించాలని అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో పౌర సరఫరాల సహాయ అధికారి సురేశ్ రెడ్డి, ఉప తహసీల్దార్ నర్సింగ్ రావు, ఇన్‌స్పెక్టర్ విజయసింహ రెడ్డి, నర్సింహా రెడ్డి పాల్గొన్నారు.