కార్మికుల హక్కుల కోసమే ఏఐటీయూసీ లక్ష్యం

0చూసినవారు
కార్మికుల హక్కుల కోసమే ఏఐటీయూసీ లక్ష్యం
భువనగిరిలో ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల గోడపత్రికలను జిల్లా అధ్యక్షులు బొలగాని సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ ఆవిష్కరించారు. సెప్టెంబర్ 6, 7, 8 తేదీల్లో కరీంనగర్‌లో జరిగే ఈ మహాసభలను కార్మికులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, అసంఘటిత రంగ కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. కార్మికుల హక్కుల సాధన, వాటి పరిరక్షణ కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాడుతుందని, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌లను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్