
క్రికెట్లో భారత పుత్రికలు చరిత్ర సృష్టించారు: మోదీ
ప్రధాని నరేంద్రమోదీ భారత మహిళా జట్టు చారిత్రాత్మక వన్డే ప్రపంచకప్ విజయంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం దేశ మహిళల్లో ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచిందన్నారు. బిహార్లోని సహర్సాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, “క్రికెట్లో భారత పుత్రికలు చరిత్ర సృష్టించారు’’ అని పేర్కొన్నారు. ఎన్డీయే అంటే వికాసం, మహాగఠ్బంధన్ అంటే వినాశనమని విమర్శించిన మోదీ, తొలి సారి ఓటు వేయబోయే యువతను ప్రజాస్వామ్యంలో తమ హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.




