ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన

3చూసినవారు
ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో మహిళా వారోత్సవాల సందర్భంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో జి. జలంధర్ రెడ్డి మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, బాలికల విద్యా ప్రాధాన్యత, చట్టపరమైన నిబంధనలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాల నిర్మూలన కోసం గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. అందరూ కలిసి బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించేందుకు తమ వంతు కృషి చేస్తామని సమావేశంలో ప్రతిజ్ఞ చేశారు.

సంబంధిత పోస్ట్