ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


Feb 04, 2026, 09:02 IST/

తల్లీ బిడ్డల ఆత్మహత్య.. రైల్వే స్టేషన్ సీసీఫుటేజ్

Feb 04, 2026, 09:02 IST
TG: హైదరాబాద్ చర్లపల్లి రైల్వేట్రాక్‌పై విజయరెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తల్లి ఇలాంటి ఘోర నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమైఉంటుందనే చర్చ జరుగుతోంది. తమకు ఎలాంటి సమస్యలు లేవని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. విజయరెడ్డి తన ఇద్దరు పిల్లలు చేతన రెడ్డి, విశాల్ రెడ్డిని కారులో చర్లపల్లి రైల్వేస్టేషన్‌‌కు తీసుకెళ్లారు. ఆత్మహత్యకు ముందు విజయరెడ్డి ఇద్దరు పిల్లలతో కలిసి ప్లాట్‌ఫామ్‌పై చాలా సాధారణంగా నడుచుకుంటూ వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.