తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన బెల్లి లలిత, భువనగిరిలో పుట్టి, పేదల కష్టాలు, ఫ్లోరైడ్ సమస్యలపై తన ఆటపాటలతో ప్రజలను చైతన్యపరిచారు. తెలంగాణ కళా సమితి కన్వీనర్‌గా ఉద్యమాన్ని ఉరకలెత్తించిన ఆమెను, నాటి పాలకులు 1999లో కిడ్నాప్ చేసి, 17 ముక్కలుగా నరికి చంపారు. ఉద్యమ చరిత్రలో చెరగని ముద్ర వేసిన గానకోకిల బెల్లి లలిత వర్ధంతి నేడు.