యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి - చిట్యాల ప్రధాన రహదారి తుక్కాపురం చౌరస్తా వద్ద రైతులు ధాన్యం బస్తాలతో ఆందోళన చేపట్టారు. క్వింటాకు ఐదు కిలోలు తరుగు తీస్తున్నారని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా సీఎం, ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వారికి మద్దతుగా బిఆర్ఎస్ నాయకులు కూడా నిలిచారు.