యాదాద్రి జిల్లా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు బద్దం వాసుదేవ రెడ్డి, బీబీనగర్ మండల్ అధ్యక్షులు కొలను నిఖిల్ రెడ్డి ఆధ్వర్యంలో మహదేవపూర్ వేణుగోపాల స్వామి ఆలయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సురకంటి సత్తిరెడ్డి, జిల్లా నాయకులు పొట్టోళ్ల శ్యామ్ గౌడ్ పాల్గొన్నారు.