యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో జ్యేష్ఠ మాసం, జ్యేష్ఠ నక్షత్రం సందర్భంగా నేడు 108 కలశములతో జ్యేష్ఠాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. స్వామివారికి తిరుమంజనాభిషేకం, ప్రత్యేక అర్చనలు నిర్వహిస్తారు. ఈ పూజలో పాల్గొనే భక్తులకు సకల దోషాలు తొలగి, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.