యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని ఇంద్రియాల గ్రామంలో మద్యానికి బానిసై ధరావత్ ప్రభాకర్ (52) అనే వ్యక్తి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఈ నెల 2న ఇంటి నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయిన ప్రభాకర్, తన ఇంటి ముందున్న పాడుబడిన ఇంట్లో శవమై కనిపించాడు. మృతుడి భార్య దరావత్ రజిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు మద్యం మత్తులో హత్య జరిగిందని ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.