భువనగిరి: జిల్లా కలెక్టరేట్ చేరుకున్న మంత్రులు

0చూసినవారు
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కు రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవిన్యూ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చేరుకున్నారు. వారి వెంట భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం ఉన్నారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు వారికి స్వాగతం పలికారు. మంత్రులు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్