యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి శివారులోని సింగన్నగూడెం కాలనీలో పెండింగ్ పనులను ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు శనివారం పరిశీలించారు. మౌలిక వసతులు, తాగునీరు, విద్యుత్, రహదారుల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. పెండింగ్ పనులను వేగవంతం చేసి, గడువులోగా పూర్తి చేయాలని, లబ్ధిదారులకు అన్ని సదుపాయాలు అందేలా చూడాలని ఆదేశించారు.