పాత కక్షల నేపథ్యంలో ప్రాణ స్నేహితుడిని మద్యం తాగించి, పెట్రోల్ పోసి హత్య చేసి, ఆధారాలు లేకుండా మృతదేహాన్ని తగలబెట్టిన కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆల్వాల్ పరిధిలోని జొన్నబండకు చెందిన పొన్నకంటి కాశి అలియాస్ ప్రభ (23) తన స్నేహితుడు పొన్నకంటి శేఖర్ ను గతంలో జరిగిన రాగి తీగ దొంగతనం కేసులో తన పేరు చెప్పి అవమానించాడనే కక్షతో హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. మార్చి 30వ తేదీన శేఖర్ ను బైక్ పై తీసుకెళ్లి, మద్యం తాగించి, పెట్రోల్ పోసి హత్య చేసి, మృతదేహాన్ని తగలబెట్టాడు. ఎలాంటి క్లూ లేని ఈ కేసును భువనగిరి రూరల్ సీఐ చంద్రబాబు చాకచక్యంగా ఛేదించి, నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.