భువనగిరి: రోడ్డు సమస్య పరిష్కరించాలి

0చూసినవారు
భువనగిరి: రోడ్డు సమస్య పరిష్కరించాలి
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రావిపహాడ్ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోరుతూ, సర్పంచ్ మేడబోయిన వెంకటేష్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. మగ్ధుంపల్లి నుంచి రావిపహాడ్ తండా వరకు ఉన్న ప్రధాన రహదారి గత 16 ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోక గుంతలమయంగా మారిందని, దీనిపై అధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరారు.

ట్యాగ్స్ :