తండ్రి మందలించాడని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన యాదాద్రి జిల్లా భువనగిరి మండలం అనాజిపురంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కుప్పాల రఘు (21) కొన్ని నెలలక్రితం బ్యాంకు రుణంతో కారు కొనుగోలు చేసి అద్దెకు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కారు అద్దెకు నడవక వాయిదాలు కట్టకపోవడంతో తండ్రి వెంకటేశ్వర్ మందలించడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.