యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని స్వర్ణగిరి క్షేత్రంలో శనివారం నిత్యారాధనలతో పాటు వారం కైంకర్యాలు వైభవంగా నిర్వహించారు. శ్రీవారికి తోమాల సేవ, మధ్యాహ్నం స్వామి, అమ్మవార్ల నిత్యకల్యాణ పర్వం భక్తజనుల సమక్షంలో కనుల పండువగా జరిగాయి. సాయంత్రం తిరువీధి సేవోత్సవం నిర్వహించి, జలనారాయణస్వామికి మంగళహారతులు నివేదించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.