యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం టేకులసోమారం గ్రామానికి చెందిన నరగొని మురళి, చేగూరి వంశీరాజ్ అనే ఇద్దరు యువకులు నిన్న రాత్రి భువనగిరిలో వేడుకకు వెళ్లి వస్తుండగా నాగిరెడ్డిపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో రోడ్డుపై పడి ఉన్న ఖరీదైన మొబైల్ ఫోన్ ను కనుగొన్నారు. తమ నిజాయితీని చాటుకుంటూ, ఆ ఫోన్ ను ఈరోజు వలిగొండ పోలీసులకు అందజేశారు. యువకుల నిజాయితీని పోలీసులు అభినందించారు.