బీబీనగర్: మూసి ఉగ్రరూపం.. లో లెవెల్ వంతెన నుంచి వరద నీరు

922చూసినవారు
వికారాబాద్ జిల్లాతో పాటు హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా బీబీనగర్ మండలం గుండా ప్రవహించే మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. శనివారం తెల్లవారుజాము నుంచి బీబీనగర్ మండలం రుద్రవెల్లి శివారులో లోలెవల్ వంతెనపై నుంచి వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో, బీబీనగర్-భూదానోపోచంపల్లి మండలాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రాచకొండ కమిషనరేట్ భువనగిరి జోన్ ఆధ్వర్యంలో, పోలీస్ స్టేషన్ సిబ్బంది అక్కడ బారీకేడ్లు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్