
వృద్ధులకు బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రత్యేక సేవలు
బ్యాంక్ ఆఫ్ బరోడా 60 ఏళ్లు పైబడిన ప్రీమియం కస్టమర్ల కోసం 'బీవోబీ సీనియర్ సిటిజన్ విశేష్ సమ్మాన్' పేరుతో ప్రత్యేక సేవింగ్స్ ఖాతాను ప్రారంభించింది. ఈ ఖాతా ద్వారా ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలతో పాటు ఇంటి వద్దే బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. కుటుంబంలోని ఆరుగురు సభ్యులకు ఉచిత ఆన్‌లైన్ డాక్టర్ కన్సల్టేషన్లు, ఆన్‌లైన్‌లో ఔషధాల కొనుగోలుపై 15% తగ్గింపు, డయాగ్నోస్టిక్స్ సేవలపై 20% తగ్గింపు లభిస్తాయి. రివర్స్ మార్ట్‌గేజ్ రుణంపై ప్రాసెసింగ్ చార్జీల్లో 50% రాయితీ, లాకర్ అద్దెల్లో 20% తగ్గింపు కూడా ఉంటాయని సంస్థ ఎండీ, సీఈవో దేవదత్త చాంద్ తెలిపారు. ఈ ఖాతాలో కనీస నిల్వ రూ.లక్ష ఉండాలి.




