యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట 17వ వార్డు ఓటర్లు భారీ నిరసన చేపట్టారు. నిన్న జరిగిన 17వ వార్డు ఏకగ్రీవ ఎన్నికను వ్యతిరేకిస్తూ, అభ్యర్థిపై ఒత్తిడి తెచ్చి, ప్రలోభాలకు గురిచేశారని ఆరోపిస్తూ ఓటర్లు ఆందోళనకు దిగారు. ప్రజాస్వామ్యంలో తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 17వ వార్డుకు ఎన్నికలు జరగాలని, లేదంటే మొత్తం 20 వార్డుల్లో ఎన్నికలు జరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 10వ తేదీ వరకు ఆందోళన కొనసాగిస్తామని ఓటర్లు స్పష్టం చేశారు.