
ఇద్దరు పిల్లలను చంపి.. తల్లి ఆత్మహత్య ఘటనలో ఉద్రిక్తత
TG : వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడ మాణిక్య తండాకు చెందిన బోడ స్రవంతి, ప్రవీణ్ దంపతులు హైదరాబాదులో బతుకుతెరువు కోసం వెళ్లి, కూకట్‌పల్లిలో ఇద్దరు పిల్లలను చంపి, స్రవంతి ఆత్మహత్య చేసుకున్న ఘటనతో మృతురాలి స్వగ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. భర్త వేధింపులు తాళలేకనే ఆత్మహత్య చేసుకుందని మృతురాలి బంధువులు ఆరోపిస్తూ, భర్త ఇంటిని, ఫర్నిచర్‌ను తగలబెట్టారు.




