
ఆఫ్ఘన్ బోర్దర్ వద్ద పాక్ వైమానిక దాడులు.. 29 మంది మిలిటెంట్లు మృతి
పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వద్ద ఆదివారం పాక్ భద్రతా దళాలు గ్రౌండ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఆ తర్వాత మిలిటెంట్ స్థావరాలు, సురక్షిత ప్రాంతాలపై వైమానిక దాడులు చేపట్టాయి. ఈ దాడుల్లో సుమారు 29 మంది ఫైటర్లు మరణించినట్లు పాక్ అధికారి, ఆ దేశ సమాచార శాఖ మంత్రి అయతుల్లా తారర్ తన ఎక్స్ ఖాతాలో తెలిపారు. దేశంలో జరుగుతున్న మిలిటెంట్ల దాడుల నేపథ్యంలో సరిహద్దు వద్ద ఆపరేషన్ చేపట్టినట్లు పాక్ మంత్రి పేర్కొన్నారు.




