
16 ఏళ్ల తర్వాత నోకియా ఫోన్ల డెలివరీ.. లిబియాలో వింత ఘటన
లిబియాలో 2010లో ఆర్డర్ చేసిన నోకియా ఫోన్లు 16 ఏళ్ల తర్వాత, అంటే 2026లో డెలివరీ కావడం కలకలం రేపుతోంది. అప్పట్లో నోకియా ఫోన్లకు విపరీతమైన డిమాండ్ ఉండేది. అయితే, లిబియాలో జరిగిన అంతర్యుద్ధం కారణంగా షిప్మెంట్ ఆగిపోయి, ఫోన్లు వేర్హౌస్లోనే ఉండిపోయాయి. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో ఈ డెలివరీలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఘటనకు సంబధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.




