గుంటూరులోని విజ్ఞాన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎన్. ఉషారాణి మాట్లాడుతూ, భవిష్యత్తులో వ్యవసాయం, రక్షణ, వైద్యం, సర్వేలు, డెలివరీ సేవలు వంటి అన్ని రంగాల్లో డ్రోన్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. విద్యార్థులు ఈ ఆధునిక సాంకేతికతను నేర్చుకోవడం ద్వారా మంచి కెరీర్ అవకాశాలు పొందవచ్చని ఆమె చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా, భూదాన్ పోచంపల్లి మండలం, దేశ్‌ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో 'డ్రోన్ టెక్నాలజీ: డిజైన్, ఆపరేషన్ మరియు రియల్ టైమ్ అప్లికేషన్స్' అనే అంశంపై మూడు రోజుల ప్రత్యేక వర్క్‌షాప్ గురువారం ముగిసింది.