తెలంగాణ ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ, పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆదివారం మోత్కూరు మండల కేంద్రంలో జరిగిన అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డిగ్రీ పీజీ కళాశాల యాజమాన్యం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున తక్షణమే బకాయిలు చెల్లించాలన్నారు.