భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గం
కాంగ్రెస్ పార్టీ అజ్వర్వర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ లు జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి పట్టణంలోని గాంధీ పార్క్ వద్ద నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ పోషించిన కీలక పాత్రను, దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు.