వరద నీటిలో ప్రభుత్వ భవనాలు

495చూసినవారు
వరద నీటిలో ప్రభుత్వ భవనాలు
చౌటుప్పల్‌ పట్టణంలోని ప్రభుత్వ భవనాలు లక్కారం చెరువు నుంచి ప్రవహిస్తున్న అలుగు నీటితో వరదలో మునిగిపోయాయి. టీటీడీ కల్యాణ మండపం, తహసీల్దార్‌ కార్యాలయం వంటి నిరుపయోగంగా ఉన్న భవనాలతో పాటు, వినియోగంలో ఉన్న మినీ పాలశీతలీకరణ కేంద్రం కూడా నీట మునిగింది. దీంతో భవనాల్లోకి రాకపోకలు నిలిచిపోయాయి. పాల సేకరణ తాత్కాలికంగా మరో ప్రాంతం నుంచి జరుగుతోంది.

సంబంధిత పోస్ట్