యాదాద్రిజిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ వెంకట రెడ్డి బుధవారం వలిగొండ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోళ్లను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతుల వద్దకు వెళ్లి ధాన్యం కొనుగోళ్లలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.