అంగన్వాడి కేంద్రాల్లో ఘనంగా అన్నప్రాసన

2చూసినవారు
అంగన్వాడి కేంద్రాల్లో ఘనంగా అన్నప్రాసన
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలోని 3, 4వ అంగన్వాడీ కేంద్రాల్లో మంగళవారం ఎన్‌హెచ్‌డీ ప్రోగ్రాం ఆధ్వర్యంలో శిశువులకు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ హాజరై చిన్నారులకు ఆప్యాయంగా అన్నప్రాసన చేశారు. చిన్నారుల ఆరోగ్యం, పోషణపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్