యాదాద్రి భువనగిరి జిల్లా, బీబీనగర్ మండల కేంద్రంలో గురుపూజోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేశారు. ఉపాధ్యాయులు జాతి నిర్మాతలను అని మండల తహసిల్దార్ శ్యాంసుందర్ రెడ్డి అన్నారు. ఆదర్శమైన ఉపాధ్యాయులను
విద్యార్థులు ఎప్పటికీ మర్చిపోరని మండల విద్యాధికారి సురేష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.