
కేరళ స్టేట్ ఫిలిం అవార్డ్స్.. క్లీన్ స్వీప్ చేసిన మంజుమ్మల్ బాయ్స్
55వ కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్- 2025లో 'మంజుమ్మల్ బాయ్స్' అదరగొట్టింది. చిదంబరం దర్శకత్వం వహించిన 'మంజుమ్మల్ బాయ్స్' ఉత్తమ చిత్రంగా నిలిచి, మొత్తం 10 అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సినిమాటోగ్రాఫర్, ఉత్తమ గీత రచయిత, ఉత్తమ కళా దర్శకుడు, ఉత్తమ సౌండ్ మిక్సింగ్, ఉత్తమ సౌండ్ డిజైన్, ఉత్తమ ప్రాసెసింగ్ ల్యాబ్ అవార్డులు కూడా ఈ చిత్రానికి దక్కాయి. ఈ మూవీ తెలుగులో విడుదలై విశేష ఆదరణ పొందింది.




