కొమ్మాయిగూడెం కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి మల్లారెడ్డి నామినేషన్

4చూసినవారు
కొమ్మాయిగూడెం కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి మల్లారెడ్డి నామినేషన్
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని కొమ్మాయిగూడెం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మారేపల్లి మల్లారెడ్డి మంగళవారం నాడు భారీ జనసందోహంతో ర్యాలీగా బయలుదేరి రామన్నపేట గ్రామపంచాయతీ వద్ద నామినేషన్ వేశారు. తనకు ఓటేసి గెలిపిస్తే ప్రజలకు సేవకుడిగా ఉంటానని, గ్రామ సమస్యలను తన సమస్యలుగా భావించి తీరుస్తానని ఆయన తెలిపారు. ప్రజలతో కలిసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని, అందరికీ అందుబాటులో ఉండి సేవ చేయడానికి తాను ముందుంటానని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో అవకాశం ఇచ్చి గెలిపిస్తే ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. వీరి వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్