కొత్తపల్లి అక్షిత్ జిల్లా స్థాయిలో 2వ ర్యాంకు సాధించాడు

383చూసినవారు
కొత్తపల్లి అక్షిత్ జిల్లా స్థాయిలో 2వ ర్యాంకు సాధించాడు
యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి నియోజకవర్గం, వలిగొండ మండలం పహిల్వాన్ పూర్ గ్రామానికి చెందిన కొత్తపల్లి అక్షిత్, తన తండ్రి కొత్తపల్లి సతీష్ (572 మార్కులు)తో పాటు వలిగొండ మండల స్థాయిలో మొదటి ర్యాంకు సాధించి, జిల్లా స్థాయిలో రెండవ ర్యాంకు సాధించడం గర్వకారణమని పహిల్వాన్ పూర్ సర్పంచ్ బద్దం కరుణ శ్రీ పవన్ కుమార్ రెడ్డి అన్నారు. పహిల్వాన్ పూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులవడం సంతోషదాయకమని, జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థులను తీర్చిదిద్దిన పాఠశాల హెచ్‌ఎం మంత్రాల మహాలక్ష్మికి, ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్