పేద మహిళకు రూ.15,000 విలువైన మందులు అందజేత

223చూసినవారు
పేద మహిళకు రూ.15,000 విలువైన మందులు అందజేత
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం కంకణాలగూడెం గ్రామానికి చెందిన నిరుపేద మహిళ సిరిపంగి నర్సమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకున్న ఈ ఎల్ వి భాస్కర్, ఆమెకు రూ.15,000 విలువైన మందులు అందించారు. పేదల ఆదుకోవడమే తమ ఫౌండేషన్ కర్తవ్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బండమిది కిరణ్, విజయ్, బాలకృష్ణ, శ్రీను, మహేష్, సతీష్, శంకర్, రాజు, తదితరులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ ఎల్ వి భాస్కర్ అందిస్తున్న సేవల పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.