భువనగిరి పట్టణంలో బుధవారం రోజున ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 141వ మే డే వారోత్సవాల గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ, మే డే కేవలం కార్మికుల పండుగ మాత్రమే కాదని, ప్రపంచ కార్మిక వర్గ పోరాటాలకు ప్రతీక అని అన్నారు. 1886 మే 1న చికాగోలో 8 గంటల పని దినం కోసం జరిగిన సమ్మె కార్మిక చరిత్రలో మైలురాయిగా నిలిచిందని, ఆ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన కార్మికుల వల్లే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం గుర్తింపు పొందిందని తెలిపారు. మే డేను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.