మోట కొండూరు: ఉరేసుకొని మహిళ బలవన్మరణం

3చూసినవారు
మోట కొండూరు: ఉరేసుకొని మహిళ బలవన్మరణం
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలోని దిలావర్పూర్ లో మంగళవారం దూర్పాటి బాయ్ (38) అనే మహిళ బలవన్మరణానికి పాల్పడింది. చత్తీస్గడ్ కు చెందిన ఈమె, గత మూడేళ్లుగా తన కుటుంబంతో కలిసి గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ నివాసం ఉంటోంది. మూడు రోజులుగా కడుపు నొప్పి, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న ఆమె, మంగళవారం ఇంట్లోనే ఉంటానని చెప్పి భర్త, కుమారుడు పనికి వెళ్లిన తర్వాత ఉరి వేసుకుంది. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన భర్త ఆమెను విగతజీవిగా చూసి పోలీసులకు సమాచారం అందించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్