యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో సీపీఐ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మాజీ కమ్యూనిస్టు నాయకుడు బీసు సోములు ఎనిమిదవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాసికంటి లక్ష్మీ నరసయ్య పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దామోదర్ రెడ్డి, ఎండి ఇమ్రాన్, వెంకట్, అంజయ్య పాల్గొన్నారు.