ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం రాయగిరి స్వయంభు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కొండ చుట్టూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రదక్షిణ నిర్వహించారు. శ్రీనివాస్ గురుస్వామి ఆధ్వర్యంలో హరినామ సంకీర్తన చేస్తూ భక్తులు కొండ చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరాములు స్వామీజీ, చంద్రం, సత్యం, మహిళా భక్తులు పాల్గొన్నారు.