పంతంగి టోల్‌ ప్లాజా వద్ద వాహనాల రికార్డు రాకపోకలు

2చూసినవారు
పంతంగి టోల్‌ ప్లాజా వద్ద వాహనాల రికార్డు రాకపోకలు
సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. పండుగకు మూడు రోజుల ముందు నుంచే ప్రయాణికులు తమ ఊళ్లకు తరలివెళ్తుండటంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద రికార్డు స్థాయిలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. సాధారణ రోజుల్లో రోజుకు 35-40 వేల వాహనాలు తిరిగే ఈ మార్గంలో, గత రెండు రోజుల్లోనే దాదాపు 1.35 లక్షల వాహనాలు ప్రయాణించినట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్