
కుమారుడ్ని కాపాడేందుకు.. చిరుతను చంపిన వ్యక్తి
గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో బుధవారం రాత్రి ఇంటి బయట ఉన్న బాబూభాయ్ నారన్‌భాయ్ వాజాపై చిరుత దాడి చేసింది. కేకలు విన్న కుమారుడు శార్దూల్ బయటకు రాగా, చిరుత అతనిపై కూడా దాడి చేసింది. కొడుకును కాపాడేందుకు బాబూభాయ్ కొడవలితో చిరుతను చంపాడు. గాయపడిన తండ్రీకొడుకులకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, చిరుత కళేబరాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. బాబుభాయ్, శార్దూల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




