
హెచ్-1బి ఉద్యోగులకు అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్
అమెరికా వీసా ఇంటర్వ్యూలు ఆలస్యం కావడంతో భారత్లో చిక్కుకుపోయిన తమ హెచ్-1బి ఉద్యోగులకు అమెజాన్ సంస్థ ఊరటనిచ్చింది. వీసా సమస్యల వల్ల ఒత్తిడిలో ఉన్న సిబ్బందికి వెసులుబాటు కల్పిస్తూ, మార్చి 2 వరకు 'వర్క్ ఫ్రమ్ హోమ్' చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 13 నుండి భారత్లో వీసా ఇంటర్వ్యూ తేదీల కోసం వేచి చూస్తున్న హెచ్-1బి హోల్డర్లు ఇంటి నుండే పని చేయవచ్చు. అయితే, ఈ కాలంలో ఉద్యోగులు క్లయింట్లతో నేరుగా మాట్లాడకూడదు, కొత్త కోడింగ్ రాయడం, ఫిక్స్ చేయడం వంటివి చేయకూడదనే నిబంధన ఉంది.




