యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు శివారులో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టడంతో, టిప్పర్లో ప్రయాణిస్తున్న ఇద్దరు కార్మికులు క్యాబిన్లో ఇరుక్కుపోయారు. ఈ దుర్ఘటనలో హరి అనే వ్యక్తి కాలు పూర్తిగా తెగిపోగా, బిలాల్ అనే వ్యక్తి కాలు విరిగింది. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.