తుప్రాన్పేటలో వృద్ధురాలి అనుమానాస్పద మృతి.. హత్య కోణంలో విచారణ

0చూసినవారు
తుప్రాన్పేటలో వృద్ధురాలి అనుమానాస్పద మృతి.. హత్య కోణంలో విచారణ
యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం తుప్రాన్పేటలో ఒంటరిగా నివసిస్తున్న 70 ఏళ్ల వృద్ధురాలు యాదమ్మ అనుమానాస్పద స్థితిలో ఆదివారం మృతి చెందింది. ఆమెపై దాడి జరిగిందా లేక దొంగతనం కోసమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న చౌటుప్పల్ సీఐ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్