భువనగిరిలో మే 8, 9, 10 తేదీలలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా పోస్టర్‌ను ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ మేళా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.