యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఈదుళ్ళగూడెం వరి ధాన్యం సెంటర్ ను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి, వారికి ధైర్యం చెప్పారు. రైతులు అధైర్య పడవద్దని హామీ ఇచ్చారు. ఈ తనిఖీలో చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి, వలిగొండ తహసీల్దార్ దశరథ్, వలిగొండ ఎస్సై యుగంధర్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాల్గొన్నారు.