యాదాద్రి: తనువు చాలిస్తూ.. ప్రాణదానం చేసిన కార్మికుడు

497చూసినవారు
యాదాద్రి: తనువు చాలిస్తూ.. ప్రాణదానం చేసిన కార్మికుడు
రాజాపేట మండలంలోని బేగంపేట గ్రామానికి చెందిన గీత కార్మికుడు తులసి అశోక్ గౌడ్, జనవరి 23న తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారిపడి తీవ్ర గాయాలపాలయ్యారు. హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు బ్రెయిన్ డెడ్ కావడంతో, జీవన్ దాన సంస్థ సహకారంతో కుటుంబ సభ్యులు అవయవదానం చేశారు. తనువు చాలించిన అశోక్ గౌడ్, మరికొంతమందికి ప్రాణదానం చేశారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్