తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ బాలాజీ ప్రకటించారు. వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో సాయంత్రం నుండి రాత్రి వరకు వర్షం కురిసే అవకాశం ఉంది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. నార్త్ తెలంగాణ, ఈస్ట్ తెలంగాణ జిల్లాల్లో 43-45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో 40-42 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని తెలిపారు.