యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయం సుందరయ్య భవన్ లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు పాల్గొన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను జెన్ కో నే నడపాలని, ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టకూడదని ఆయన అన్నారు. వామపక్ష పార్టీల మధ్యన ఉన్న భేదాలను తగ్గించుకుని ముందుకు వెళ్తామని తెలిపారు.