ఉద్యోగం పోయిందనే మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య

3చూసినవారు
ఉద్యోగం పోయిందనే మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య
ఉద్యోగం కోల్పోయాననే మనస్తాపంతో ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న చెవగోని మనోజ్ (26) అనే యువకుడు మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. హైదరాబాద్ గచ్చిబౌలిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న మనోజ్ ను యాజమాన్యం తొలగించడంతో తీవ్ర మనస్తాపానికి గురై, 31న ఇంట్లో ఎలుకల మందు తాగాడు. తల్లిదండ్రులు గమనించి ఆసుపత్రులకు తరలించినా, చికిత్స పొందుతూ మరణించాడు.

సంబంధిత పోస్ట్